ప్రకాశం జిల్లాలో రైతులకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని దానిని రైతులు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కోరారు సోమవారం ఒంగోలు నగరంలోని రాంనగర్ ఒకటవ లైన్ లో ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో రైతులు 38వేల 36 ఎకరాలలో వరి పంటను సాగు చేశారని సుమారుగా 94,768 టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తుందని అంచనా వేసినట్లు తెలియజేశారు ప్రభుత్వం గ్రిడ్ఏ రకం ధాన్యాన్ని 200389 రూపాయలకు సాధారణ రకం ధాన్యాన్ని కింటా 2369 రూపాయలకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు