బనగానపల్లె: కోవెలకుంట్లలో జింకపిల్లపై కుక్కల దాడి
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల టీచర్స్ కాలనీ సమీపంలో బుధవారం దారితప్పి వచ్చిన జింకపిల్లపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు కుక్కల బారి నుంచి జింకను రక్షించి పశువైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. జింకపిల్లకు ఎటువంటి ప్రాణాపాయం లేదని పశువైద్యుడు కిషోర్ కుమార్ తెలిపారు.గాయాల నుంచి కోలుకుంటుందని ఆయన వెల్లడించారు.