రాపురు: సిద్ధవరం గ్రామం జాతీయ రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా, కింద పడిపోయిన యూరియా బస్తాలు
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం గ్రామం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ 07 ఎక్స్ 1159 నెంబరు గల లారీ కోవూరు నుంచి యూరియా బస్తాల లోడుతో వెంకటగిరి వైపు వెళుతోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం లారీ అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే పొదల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని యూరియా బస్తాలన్నీ కింద పడిపోగా లారీ డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.