అనంతపురం అర్బన్: దత్తాపురం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో మృతి
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
వైయస్సార్ కడప జిల్లా రైల్వే కొండాపురం మండలంలోని దత్తాపురం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని తాడిపత్రి పట్టణం ఎల్లనూరు రోడ్డుకు చెందిన రమేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.