సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి విపి గౌతమ్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇందిరమ్మ ఇండ్ల కార్యదర్శి వీపి గౌతమ్ పేర్కొన్నారు. గురువారం నర్సాపూర్ నియోజకవర్గంలోని పెద్ద చింతకుంట కొల్చారం మండలంలోని రాంపూర్ కౌడిపల్లి మండలంలోని ధర్మసాగర్ తదితర గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పూనుకుందని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టి ఇవ్వాలని లక్ష్యంతో పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.