వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర బిజెపి మహిళ మోర్చా కార్యవర్గం లో వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీదేవిసదానందరెడ్డికి చోటు
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీమహిళ మోర్చా కార్యవర్గ సభ్యులలో వికారాబాద్ జిల్లా నుండి 24 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీదేవి సదానంద రెడ్డికి చోటు దక్కింది. ఈరోజు శనివారం రాష్ట్ర కార్యాలయం నుండి మహిళా మోర్చా కార్యవర్గం ఎన్నికైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై రాష్ట్ర శాఖ నమ్మకం ఉంచి మహిళామోర్చలో స్థానం కల్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కోసం మహిళలో చైతన్యం కల్పిస్తానని తెలిపారు.