వికారాబాద్: శివరాత్రి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోశివాలయాల వద్ద భక్తులు ఉపవాస దీక్ష విరమణ.
శివరాత్రి మహా పర్వదినం సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. ఉదయం నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రంలో శివ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.సాయంత్రం 6 గంటల తర్వాత భక్తులు శివాలయాల దర్శనం అనంతరం నైవేద్యం సమర్పించి పండ్లు ఫలాలతో దీక్ష విరమింప చేశారు. శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.