చీరాలలో యువసేన హీరో నిఖిల్ సందడి, గజమాలతో ఘన స్వాగతం పలికిన అభిమానులు, టిడిపి శ్రేణులు
యువ సినీ హీరో నిఖిల్ బుధవారం రాత్రి చీరాలలో సందడి చేశారు.ఒక సినిమా షూటింగ్ నిమిత్తం విచ్చేసిన నిఖిల్ కు వాడరేవు బైపాస్ రోడ్డు వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఆయనకు గజమాలవేసి వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు.వారందరికీ నిఖిల్ అభివాదం చేసి సరదాగా ముచ్చటించారు.చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు నిఖిల్ వరుసకు అల్లుడు కావడంతో టిడిపి శ్రేణులు కూడా భారీగా తరలివచ్చాయి.మూడు రోజులపాటు నిఖిల్ ఇక్కడే ఉంటారు.