అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని విరుపాపల్లి గ్రామంలో సోమవారం రాత్రి సద్గురు శ్రీ నారాయణ స్వామి వారి 52వ ఆరాధన, రథోత్సవ కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. మర్తాడు మఠాధ్యక్షులు జ్ఞానమూర్తి స్వామి, మఠాధ్యక్షులు మారాచి సూర్యనారాయణ స్వామి, గ్రామ పెద్దలు ట్రస్ట్ సభ్యులు కలసి పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఉత్సవం సందర్భంగా ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం మహా బిల్వర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని, భజన కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు.