ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ సిఐ హజరతయ్యా, నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలన్న సీఐ
Ongole Urban, Prakasam | Apr 29, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిఐ హజరతయ్యా బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఆటో డ్రైవర్లు వ్యవహరించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కించరాదని అంతేకాకుండా ఎల్ఈడి లైట్లు బిగించి ఎదురుగా వచ్చే వాహనదారులకు అపాయం కలిగించరాదని సీఐ తీవ్రంగా హెచ్చరించారు. ఆటో డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహన సంబంధిత పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు.