రాజమండ్రి సిటీ: సిపిఐ జాతీయ సభలో పాల్గొనటానికి చండీగఢ్ కు చేరుకున్న రాజమండ్రి హమాలీలు
చండీగఢ్లో జరుగుతున్న సిపిఐ 25వ జాతీయ మహాసభలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి 100 మంది హమాలీ కార్మికులు హాజరయ్యారు. ఆదివారం అక్కడికి చేరుకున్న వారికి పార్టీ రాష్ట్ర సమితి నాయకత్వం ఘన స్వాగతం పలికింది. జట్ల సంఘం అధ్యక్షుడు రాంబాబు నాయకత్వంలో వీరంతా వెళ్లారు. ఈ సభలకు హమాలీ కార్మికులు రావడం ఆనందదాయకమని ముప్పాళ్ళ అన్నారు.