కడప: 184 అడుగులకు చేరిన కమలాపురంలోని బుగ్గ వంక డ్యామ్ నీటిమట్టం
Kadapa, YSR | Oct 28, 2025 మొంథా తుఫాన్ ప్రభావంతో కమలాపురం నియోజకవర్గంలోని బుగ్గ వంక డ్యాంలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఫలితంగా డ్యాం నీటిమట్టం 184 అడుగులకు చేరుకుంది. మొత్తం సామర్థ్యం 188 అడుగులు మాత్రమే ఉండగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డ్యాం పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.