ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్ లోని కార్గో కొరియర్ సేవలు శనివారం నిలిచిపోయాయి. మరమ్మత్తుల కారణంగా గిద్దలూరు పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు. విద్యుత్ లేని కారణంగా కార్గో కొరియర్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్వీసులు అందించేందుకు ఏర్పాటు చేసిన ఇన్వర్టర్ పనిచేయకపోవడంతో సర్వీసులు నిలిచిపోయినట్లుగా కార్యాలయం సిబ్బంది తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చి కొరియర్ చేసే వినియోగదారులు మాత్రం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.