తిరుపతి జిల్లా నాయుడుపేట బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మునిరత్నం మాట్లాడుతూ రానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఎలా శిక్షణ ఇవ్వాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. నాయుడుపేట, ఓజిలి, పెల్లకూరు, దొరవారి సత్రం, చిట్టమూరు, తడ, సూళ్లూరుపేట మండలాల ఉపాధ్యాయులకు రోజుకు ఒక సబ్జెక్టు లెక్కన డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఓరల్ టెస్ట్ శిక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.