బనగానపల్లె: బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వంద మంది గర్భిణీలకు పౌష్టికాహారం అందజేత
నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్లు సుజాత, ఉమాదేవి 100 మంది గర్భిణులకు ఉచిత పౌష్టికాహారం అందజేశారు. ప్రతీ నెల 9న సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా తల్లుల ఆరోగ్యం, గర్భంలోని శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం అందించడం లక్ష్యమని వారు తెలిపారు.