జహీరాబాద్: కంకల్ టోల్ ప్లాజా వద్ద 260 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు, నలుగురు నిందితుల అరెస్ట్
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు ఒడిస్సా నుంచి బీదర్ కు రెండు వాహనాల్లో తరలిస్తున్న 260 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.