కనిగిరి: సంక్రాంతి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ సూచించారు. కనిగిరిలోని డిఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహించి అమూల్యమైన నగదును, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డిఎస్పి సూచించారు. కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే అట్టి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షలకు బైండ్ ఓవర్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.