ఒంగోలు అర్బన్: పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి :జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 18, 2026
పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఐదు గ్రామాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చిన అర్జీలలో ఆర్థిక సంబంధమైనవి, ఆర్థికేతరమైనవిగా వేరుచేసి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.