వృద్ధురాలిని బాపట్ల శివారులో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిన కన్న కొడుకు,సొంత తమ్ముడు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
73 ఏళ్ల వృద్ధురాలిని కన్న కొడుకు,సొంత తమ్ముడు కలిసి బాపట్ల పట్టణ శివారులోని ఒక బ్రిడ్జి వద్ద వదిలేసి వెళ్లిన ఘటన మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది.ఒంటరిగా ఉన్న ఆమెను స్థానికులు పలకరించగా తన పేరు రజియాబీ అని,తనది చెందోలు గ్రామమని,తన కుమారుడు,తమ్ముడు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారని చెప్పుకుంది.ఏం చేయాలో తనకు పాలు పోవడం లేదని వాపోయింది.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.