డోన్: డోన్ కు చెందిన ఓ వ్యక్తి చనిపోయినట్లు సర్టిఫై చేసిన కర్నూలుకు చెందిన ఒమేగా ఆసుపత్రి ఆరోగ్యమిత్ర
Dhone, Nandyal | Jun 27, 2026 నంద్యాల జిల్లా డోన్ కు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి కర్నూలు పట్టణంలోని ఒమేగా ఆసుపత్రి నందు క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే అక్కడి ఆరోగ్య మిత్ర బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా పొరపాటున సర్టిఫై చేశాడు. దీంతో ఆరోగ్య మిత్రలో డెత్ అప్డేట్ అయిందని ఆసుపత్రి వైద్యులు అతనికి వైద్యం నిలిపివేశారు. ఎమ్మార్వో లైవ్ సర్టిఫికెట్ ఇచ్చిన బాధ్యునికి ట్రీట్మెంట్ అందడం లేదు దీంతో భాధిత కుటుంబం శనివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ఆశ్రయించాడు.