రాజేంద్రనగర్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ సిలిండర్ పేలి మహిళలకు గాయాలు
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో.. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.