డోన్: బేతంచెర్ల లో వర్షాలు కురవాలని మహాశివునికి మహాభిషేకం
Dhone, Nandyal | Aug 3, 2026 ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బేతంచెర్లలోని బోయపాటి శివాలయంలో సోమవారం కాలనీవాసులు, రైతుల ఆధ్వర్యంలో పరమేశ్వరునికి 101 బిందెలతో మహాభిషేకం నిర్వహించారు. ప్రకృతి అనుకూలించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారికి పూజలు చేశారు.