ఆలమూరు మండలంలోని చొప్పెల్ల, మూలస్థానం అగ్రహారం గ్రామాలలో కంకర దుమ్ముతో పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
ఆలమూరు మండలంలోని చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం లంక గ్రామాల్లో గోదావరి నది చెంతన ఏటిగట్టు మార్గానికి ఇరువైపులా ఉన్న పంట పొలాల రైతులు కంకర దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కంకర, దుమ్ము పంటలపై పడి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు.