జహీరాబాద్: సైబర్ నేరాలు పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి, హద్నూర్ ఎస్సై సుజిత్
సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్సై సుజిత్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం చాల్కి ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సాయంత్రం విద్యార్థులకు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుజిత్ మాట్లాడుతూ మొబైల్ లో అనవసరంగా వచ్చే మెసేజ్లు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దన్నారు. లాటరీల పేరుతో వచ్చే కాల్స్ , మెసేజ్లకు స్పందించవద్దన్నారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు విపులంగా వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.