ఒంగోలు అర్బన్: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యం : రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి
Ongole Urban, Prakasam | Apr 24, 2026
పంచాయతీ రాజ్ వ్యవస్థ లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హల్లో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి, మాట్లాడుతూ, మహాత్మాగాంధీ పల్లె సీమలు అభివృద్ధి చెందాలి, గ్రామా స్వరాజం రావాలని నినాదం తీసుకురాగా, డా. బిఆర్ అంబేద్కర్ గ్రామసీమలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందాలని రాజ్యాంగంలో భాగం చేశారన్నారు