పలమనేరు: కోర్టు కానిస్టేబుళ్లపై అవినీతి ఆరోపణలు, డీఎస్పీకి ఫిర్యాదు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన న్యాయవాదుల సంఘం
పలమనేరు: కోర్టులో పనిచేసే కొందరు కోర్టు కానిస్టేబుళ్లపై పలమనేరు బార్ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ కొంతమంది కానిస్టేబుళ్లు పలువురు న్యాయవాదులకు కేసులు ఇచ్చి భారీగా డబ్బులు తీసుకోవడం, నేరస్తులకు అనుకూలంగా సాక్ష్యాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని DSPకి ఫిర్యాదు చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.