గుంతకల్లు: పామిడి వీఆర్ఓ సుధీర్ బాబు అవినీతి, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బాధితుడి వీడియో
పామిడి తహసీల్దార్ కార్యాలయంలోని వీఆర్ఓ సుధీర్ బాబు అవినీతికి పాల్పడినట్టు బాధిత రైతు సింగం శెట్టి సూరి మాట్లాడిన వీడియో బుధవారం వైరల్ గా మారింది. పామిడి మండలంలోని తంబళ్లపల్లిలో రైతు సూరికి ఉన్న నాలుగు ఎకరాల భూమికి పాస్ బుక్ ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేయడంతో రైతు రూ.4వేలు ఇచ్చాడు. డబ్బు తీసుకొని కూడా నెలల గడుస్తున్నా పని చేయలేదని డబ్బు తిరిగి ఇవ్వమంటే రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నాడని రైతు వీడియో లో వాపోయాడు. రైతు మాట్లాడిన వీడియో ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్ లలో భారీగా వైరల్ అవుతోంది.