వేములవాడ: అత్యంత వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..ఆకట్టుకున్న మహిళల బతుకమ్మ ఆటపాటలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగాయి. మహిళా మణులు బతుకమ్మ ఆటపాటలతో కనివిందు చేశారు. తీరోక్క పుష్పాలతో శోభాయమానంగా బతుకమ్మను పేర్చి మహిళా మణులు సాంప్రదాయ దుస్తులను ధరించి బతకమ్మను ఆడిపాడి తన్మయత్వాన్ని పొందారు. వేములవాడ రాజన్న ఆలయ ధర్మగుండంతో పాటు మూలవాగులో బతుకమ్మలను మహిళా మణులు నిమర్జనం చేసి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు.