ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త డొంక సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని స్థానిక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 5,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టారీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.