టిడిపి నాయకులు పెడుతున్న దొంగ కేసులకు సహకరిస్తున్న అధికారులు బాధితుల కన్నా ఎక్కువ రోజులు జైలు శిక్ష అనుభవిస్తారని ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. కంభం మండలానికి చెందిన వైసిపి నాయకుడు నెమలి దీన్నే చెన్నారెడ్డి అరెస్టును అక్రమం అంటూ ఆయన ఖండించారు. 30 సెకండ్లు ఇద్దరు వ్యక్తుల సంభాషణలో రాజకీయం చేసి దొంగ కేసులు పెట్టారని నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి కాంటాక్ట్ లేకపోయినా రిప్స్ ఇరిగేలా కొట్టారని డాక్టర్లు ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్ తో చెన్నారెడ్డి పై దొంగ కేసు పెట్టడం చాలా దారుణమని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు.