నందికోట్కూరు: కొలను భారతి దేవి క్షేత్రంలో: సీతాకోక చిలుకల సందడి
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని కొలనుభారతి దేవి అమ్మవారి క్షేత్రంలో సీతాకోక చిలుకలు సందడి చేశాయి, ఎండ తీవ్రతతో కొలనుభారతి ఆలయ క్షేత్రంలో భక్తులు రావడానికి చలువ చాపలను ఏర్పాటు చేశారు, చలువ చాపల చుట్టూ తేమ ఉండడంతో సీతాకోకచిలుకలు చుట్టు ముట్టాయి, వాటిని చూసిన సందర్శకులు తమ చరవాలలో వీడియోలను తీసుకొని నిక్షిప్తం చేసుకున్నారు, మండుతున్న ఎండలలో కూడా సీతాకోకచిలుకలు చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి