సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్టుకు భారీగా వరద, 1263 క్యూసెక్కుల వరద : ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు ఏ ఈ
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టుకు 12,603 క్యూసెక్కులు వరద కొనసాగుతున్నదని ఇరిగేషన్ AEE మహిపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఒక్క స్పిల్ వే ద్వారా 19,335 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.593 టీఎంసీలు వద్ద నిల్వ ఉంది. జెన్కో విద్యుత్ ఉత్పత్తికి 2,413 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన పేర్కొన్నారు. మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.