పర్వతగిరి: వరంగల్ పర్వతగిరిలో ఘనంగా రావణవధ వేడుకలు
వరంగల్ జిల్లా పర్వతగిరిలో విజయదశమి సందర్భంగా రావణవధ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలుకమ్మ చెరువు కట్టపై జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ పాల్గొన్నారు. జమ్మి పూజ అనంతరం రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేయగా, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు.