అనంతపురం జిల్లా ఉరవకొండలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్ నందు బుధవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (S FI) 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉరవకొండ మండల అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం లో భాగంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్ధార్థ పోలేశ్వర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు