ఒంగోలు అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపు ను పరిశీలించిన ఎంపీ మాగుంట
Ongole Urban, Prakasam | May 28, 2026
ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో పాత పోలీస్ క్వార్టర్స్‌ను తొలగించి చదును చేసిన ఖాళీ స్థలాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పిల్లలు సమ్మర్ క్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ పరిసర ప్రాంత అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికల గురించి జిల్లా ఎస్పీ ఎంపీ కి వివరించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని పోలీస్ సిబ్బంది సంక్షేమం కొరకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు.