నంద్యాల అర్బన్: అమెరికాలో నంద్యాల జిల్లా విద్యార్థి ఆత్మహత్య, స్వగ్రామానికి మృతదేహం
Nandyal Urban, Nandyal | May 5, 2026
ఉద్యోగం రాలేదన్న బెంగతో నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెకు చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ కుమారుడైన చందు ఉన్నత చదువుల కోసం US వెళ్లి పిస్టల్తో కాల్చుకొని చనిపోవడం బాధాకరమంటూ కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి