ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎంపీతో కలిసి నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల
Ongole Urban, Prakasam | Apr 12, 2026
ఆదివారం పలు కార్యక్రమాలలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తో కలిసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు.ఒంగోలు నగరంలోని 34వ డివిజన్ విఐపి రోడ్డు నందు క్వాంటం ఐఐటీ అకాడమి కాలేజీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు, )ఒంగోలు నగరంలోని కేసరాజుగుంట నందు నూతంగా ఏర్పాటు చేసిన డా.బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు, )ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ నెహ్రు నగర్ నందు శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వారోత్సవాలు సందర్బంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు,