కర్నూలు: ఆంగ్ల భాష నైపుణ్యం తప్పనిసరి: కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి
ప్రాథమిక స్థాయిలోనే ఆంగ్లభాషపై దృష్టి సారించాలని అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు జిల్లా విద్యాధికారి యస్. శ్యామ్యూల్ పాల్ మరి కొంతమంది విద్యాశాఖ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పూర్వ ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యలోనే ఆంగ్ల భాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు జిల్లావ్యాప్తంగా 20 మంది రిసోర్స్ పర్సన్లను నియమించాలని, 20 మందికి రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లతో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. వెంటనే ప్రణాళిక కార్యచరణ రూపొందించాలని తక్షణమే అమల్లోకి రావాలని ఆదేశించారు