తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోను: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 12, 2026
తాగునీటికి సంబంధించిన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు పనిచేయకపోతే కాంట్రాక్టర్లతోపాటు అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. కొండపి నియోజకవర్గంలో జరుగుతున్న తాగునీటి నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆర్.డబ్ల్యు.ఎస్. పర్యవేక్షణలో జరుగుతున్న పనుల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కాగా, ఆశించిన స్థాయిలో పురోగతి కచ్చితంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ పనులను తక్షణమే ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు.