కర్నూలు: ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్
చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రూ. 1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.