ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు
Ongole Urban, Prakasam | Jun 21, 2026
సంపూర్ణ ఆరోగ్యానికి అనుదినం యోగా సాధన ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో పాల్గొన్న కార్యక్రమానికి సమాంతరంగా ఉదయం ఆరు గంటల నుంచి 6:45 గంటల వరకు జరిగిన యోగా సాధన కార్యక్రమంలో వీరు ఉత్సాహంగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో 2000 మంది వరకు మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.