రాజేంద్రనగర్: మేం తలచుకుంటే కాంగ్రెస్ కార్యాలయాన్ని తగలబెడతాం: ఎమ్మెల్యే రాజా సింగ్
కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడికి పాల్పడినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. నిరసన తెలపడం అంటే ఇతర పార్టీల పై దాడులు చేయడమా అని ప్రశ్నించారు. గూండాయిజం చూపించాలి అనుకుంటే మేం కూడా చూపించగలమని హెచ్చరించారు