గుట్టూరు కనుమల సమీపంలో ఆటోను ఢీకొన్న కారు ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 12, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలంలోని గుట్టూరు కనుమల గ్రామం సమీపంలో ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ధర్మవరం కు చెందిన ముత్యాలప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.