దొనకొండ మండలాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచుతూ సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసినదే. దీంతో దొనకొండ వాసులలో ఆందోళన మొదలైంది. మార్కాపురం జిల్లా కేంద్రంగా చేస్తే దొనకొండ మండలాన్ని కూడా అందులో ఉంచాలని అన్నారు. ఇప్పటికే దొనకొండ మండలాన్ని మార్కాపురం జిల్లాలో చేర్చాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు కు 120 అర్జీలు సమర్పించినట్లు పేర్కొన్నారు. దొనకొండ ఒంగోలుకు 90 మార్కాపురానికి 28 కిలోమీటర్లు ఉంటుందన్నారు.