ఆళ్లగడ్డ: గోవింద పల్లె సమీపంలో టిప్పర్ ఢీకొని ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని గోవింద పల్లె సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది, ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ట్రాక్టర్ ను బలంగా ఢీ కొనడంతో అది జాతీయ రహదారిపై బోల్తా పడింది, ఈ ఘటనలో సిరివెళ్ల ఎస్సీ కాలనీకి చెందిన పుట్టపల్లి రాజు,పల్లె రమేష్ తీవ్రంగా గాయపడ్డారు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు, ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు