నంద్యాల అర్బన్: నంద్యాల ప్రథమ నందీశ్వర ఆలయంలో బిల్వ వనం ఏర్పాటు
Nandyal Urban, Nandyal | Jul 10, 2026
నంద్యాలలోని ప్రతమ నందీశ్వర స్వామి ఆలయంలో బిల్వ వనాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆలయ ఛైర్మన్ చలం బాబు ఆధ్వర్యంలో అధికారులు, మహిళలు, ప్రజలు బిల్వ మొక్కలను నాటారు. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వ చెట్లను వనంగా ఏర్పాటు చేస్తున్నామని, వీటిని పరమేశ్వరుడి పూజ కోసం ఉపయోగిస్తామని ఛైర్మన్ తెలిపారు.