మైదుకూరు: తెలుగు గంగ ప్రాజెక్టు ఉప కాలువలకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
మైదుకూరు నియోజకవర్గ పరిధిలో తెలుగు గంగ ప్రాజెక్టు ఉప కాలువలకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు రమణ అన్నారు. సోమవారం నీటిపారుదల శాఖ అధికారులను కలిసి సమస్యను వివరించారు. తెలుగు గంగ ఉప కాలువలో నీరు అందకపోవడంతో రబీ, ఖరీఫ్లో రైతుల ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ మోటార్లు కూడా ఇంకి పోతున్నాయని అన్నారు.