ఎం తుర్కపల్లి: చోట్ల తండాలో తప్పిపోయిన ఇద్దరు పిల్లలు క్షేమం, తల్లిదండ్రులకు అప్పగించిన ఏసిపి శ్రీనివాస్ నాయుడు
యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం, రుస్తాపురం గ్రామం పరిధిలోని చోట్ల తండాలో అబ్దుల్ రెహమాన్, ప్రీతి కుమారి అనే ఇద్దరు చిన్నారులు గురువారం తప్పిపోయారు. సమాచారం అందిన వెంటనే ఎస్సై తక్యుద్దీన్ తన సిబ్బందితో కలిసి చిన్నారుల ఫోటోలు సేకరించి, గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లల ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులకు యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట రూరల్ ఎస్సై ఎం. శంకర్, సమక్షంలో గురువారం మధ్యాహ్నం అప్పగించారు. పిల్లలను తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించడంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.