శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించారు,శ్రీశైలం మహా క్షేత్రంలో కోటిదీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,ఆలయ అధికారులు ఆలయ ప్రధాన మాడవీధి నుండి నంది మండపం వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయం ముందు 45 అడుగుల భారీ కైలాసం సెట్టింగ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సాయంత్రం 6.30 గంటలకు కైలాసం వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం,దశవిధ హారతులను సమర్పించారు గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించరు.