ఒంగోలు అర్బన్: ఈనెల 17వ తేదీన మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక సమావేశం: ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి
Ongole Urban, Prakasam | Jun 16, 2026
ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఈనెల 17వ తేదీన మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా టిడిపి జనసేన బిజెపి నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని మీడియా సమావేశంలో ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా ప్రకాశం జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందిస్తున్నట్లు నరసింహారెడ్డి తెలిపారు.